TG: కోయిలసాగర్ ఎత్తిపోతల పథకం పనులు 20 ఏళ్లయినా పూర్తికాకపోవడంపై సీఎం రేవంత్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుత్తేదారు వదిలేయడంతో సమస్య వచ్చిందని, కొత్తగా టెండర్లు పిలిచామని ఇంజినీర్లు తెలిపారు. దీనికి రూ.150 కోట్లు అవసరమని పేర్కొన్నారు. అలాగే జవహర్ నెట్టెంపాడులోని గుడ్డెందొడ్డి జలాశయ సామర్థ్యం పెంపు, కల్వకుర్తి సమస్యలపై సీఎం ఆరా తీశారు.