సత్యసాయి: కదిరి శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానంలో జూన్ 8-30 వరకు నిర్ణీత తేదీల్లో ఆర్జిత కళ్యాణోత్సవ సేవలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10:30 గంటలకు ఈ సేవలు మొదలవుతాయి. రోజుకు 5 టిక్కెట్లు మాత్రమే జారీ చేస్తారు. టిక్కెట్ ధర రూ.6,500 కాగా, ఒక టిక్కెట్‌పై ఐదుగురికి ప్రవేశం కల్పిస్తారు. మరిన్ని వివరాలకు ఆలయ ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.