అనకాపల్లిలో తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయానికి రెండు ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. గురువారం అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. తుంపాల రెవిన్యూ పరిధిలో కొత్తూరు పంచాయతీలో సర్వే నంబర్ 608-10లో ప్రభుత్వ భూమిని కేటాయించారు. ఎకరానికి ఏడాదికి రూ.1,000 చొప్పున 66 సంవత్సరాలకు లీజుకు ఇస్తారని ప్రభుత్వం వెల్లడించింది.