ASR: జూలై 9,10వ తేదీల్లో విశాఖ ఏయూ క్రీడా ప్రాంగణంలో వరల్డ్ ఫుడ్ ఇండియా-2026 నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉద్యాన అధికారి బాలకర్ణ గురువారం తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఉన్నవారు అక్కడ తమ స్టాళ్లను ఏర్పాటు చేసుకుని, మార్కెటింగ్ అవకాశాలు పెంచుకోవాలన్నారు. https://regional.worldfoodindia.gov.in/Registrations/index.php ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.