ATP: రాయదుర్గం పట్టణ సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రూ.2.50 కోట్ల నిధులు మంజూరు చేసింది. గత రెండేళ్లలో వివిధ పథకాల కింద వచ్చిన రూ.10 కోట్లతో కలిపి మొత్తం రూ.13 కోట్లకు పైగా నిధులు అందాయని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు. ఈ నిధులతో రోడ్లు, మురికి కాలువలు, పారిశుద్ధ్య నిర్వహణ, మౌలిక వసతుల పనులు చేపడతామన్నారు.