KMM: భూ సర్వే ద్వారా ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. గురువారం వేంసూరు మండలంలోని అమ్మపాలెం, చౌడవరం గ్రామాలలో జరుగుతున్న భూ సర్వే పనులను పంట పొలాల్లో క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించారు. రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.