ELR: వాహనాల్లో అధిక కాంతిని వెదజల్లే LED లైట్ల వినియోగం ప్రమాదకరమని భీమడోలు సీఐ పి. కృష్ణ తెలిపారు. ఈ లైట్ల వల్ల ఎదురుగా వచ్చే డ్రైవర్ల చూపు మందగించి ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. వాహనదారులు హైబీమ్కు బదులుగా లోబీమ్ వినియోగించాలని సూచించారు. మోటారు వాహన చట్ట నిబంధనలకు విరుద్ధంగా అధిక కాంతి లైట్లు అమర్చిన వాహనాలపై చట్టపరమైన చర్యలు తప్పవని అన్నారు.