NLG: మిర్యాలగూడ పట్టణంలోని గాంధీనగర్లో ఇవాళ తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు వ్యాపించి గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న చంద్రమ్మ, లక్ష్మణ్, ప్రణతి అనే ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.