అన్నమయ్య: రామసముద్రం పోలీస్ స్టేషన్ను గురువారం జిల్లా ఎస్పీ ధీరజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, రికార్డులను పరిశీలించి, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. మత్తు పదార్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని గంజాయి సరఫరా, సాగు, విక్రయించే, తీసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని SP సూచించారు.