W.G: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాదులో నిర్వహించ తలపెట్టిన సభకు అనుమతులు నిరాకరించడం సరికాదని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. గురువారం తణుకులో మీడియాతో మాట్లాడారు. జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయవాదాన్ని భుజాన వేసుకుని పవన్ కళ్యాణ్ విమర్శించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.