TG: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకపోయినా పేదల కోసం కట్టుబడి పనిచేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రతి నియోజకవర్గంలో మొదటి విడతలో 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినట్టు తెలిపారు. రెండో విడత ఇండ్ల మంజూరు ఏప్రిల్ చివరి లేదా మే మొదటి వారంలో ఉంటుందని వెల్లడించారు. అర్హులైన ప్రతి నిరుపేదకు ఇల్లు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.