TG: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. కాసేపట్లో సీడబ్ల్యూసీ సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై కాంగ్రెస్ అగ్రనేతలు చర్చించనున్నారు. ఈ నెల 16,17 తేదీల్లో ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశం అవుతున్న సందర్భంగా.. 2011 జనాభా లెక్కలు కాకుండా తాజా లెక్కలనే కేంద్రం పరిగణలోకి తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.