TG: హైదరాబాద్లోని జలమండలి కస్టమర్ కేర్ 155313 నంబర్ సాంకేతిక సమస్య తలెత్తిందని MD అశోక్ రెడ్డి పేర్కొన్నారు. జలమండలి వెబ్సైట్, యాప్ ద్వారా వాటర్ ట్యాంకర్లు బుక్ చేసుకోవచ్చని తెలిపారు. సమస్య పరిష్కరించేందుకు BSNL సాంకేతిక బృందం చర్యలు చేపట్టిందని వెల్లడించారు. సమస్యను త్వరగా పరిష్కరించి, సేవలను సాధారణ స్థితికి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.