AP: హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీనే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. బడ్జెట్లో రూ.19 వేల కోట్లు ప్రజారోగ్యం కోసం ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఎరువుల వినియోగం ఎక్కువ కావడంతో ఆహారం కలుషితమవుతోందని చెప్పారు. దీని వల్ల క్యాన్సర్ ముప్పు పెరుగుతోందన్నారు. చిన్న తప్పు కూడా జరగకుండా పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు.