TG: ప్రజల తీర్పును కాంగ్రెస్ కాలరాసిందని మాజీమంత్రి కేటీఆర్ విమర్శించారు. ‘క్యాతన్‌పల్లిలో BRS నేతలను భయపెట్టారు. పోలీసులతో మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలనుకున్నారు. పొత్తు ధర్మాన్ని కాపాడుకున్న సీపీఐకి ధన్యవాదాలు. ఇళ్లు కూలగొడుతామని వివేక్ బెదిరించారు. నీచ రాజకీయాలు చేసిన మీకు ప్రజలే బుద్ధి చెబుతారు. పిప్పి సభలో సీఎం బూతు పురాణం మొదలు పెట్టారు’ అని మండిపడ్డారు.