TG: పాలకులం కాదు.. సేవకులమని CM రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ల 3 నెలలు పూర్తయిందని, ఆర్థిక సవాళ్ల మధ్య సంక్షేమం, అభివృద్ధి దిశగా పాలన సాగుతోందన్నారు. ఉపఎన్నికలు, స్థానిక ఎన్నికల్లో ప్రజామద్ధతు ఏర్పడిందని, గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి సమస్యల పరిష్కరిస్తున్నామని తెలిపారు. మహాలక్ష్మి సహా పలు సంక్షేమ పథకాల అమలు వేగవంతం చేస్తున్నట్లు స్పష్టం చేశారు.