TG: తెలంగాణ ఏర్పాటుపై తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను BRS నేతలు కావాలనే వక్రీకరిస్తున్నారని BJP స్టేట్ చీఫ్ రామచందర్ రావు అన్నారు. ఆయన వ్యాఖ్యల వెనుక ఉన్న అంతరార్థం వేరని.. దానిని తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. విభజన సమయంలో జరిగిన ఆశాస్త్రీయ ధోరణిని మాత్రమే ఆయన ప్రస్తావించారని తెలిపారు. BJP మద్దతు లేకుంటే TG వచ్చేదా? అని ప్రశ్నించారు.