AP: గత వైసీపీ పాలన వల్ల ఐదేళ్లు నష్టపోయామని, దీనివల్ల రాజధాని నిర్మాణ వ్యయం పెరిగిందని నారా లోకేష్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు 760 ప్రాజెక్టులను తీసుకొచ్చిందని తెలిపారు. భవిష్యత్తులో విశాఖ, అమరావతి, తిరుపతి ప్రాంతాలను మూడు ప్రధాన రీజియన్లుగా అభివృద్ధి చేస్తామని, ఇందుకోసం తమ వద్ద పక్కా బ్లూప్రింట్ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.