TG: దేశంలోనే ఆహార కల్తీలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని BJP ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ పెడతామని గత ప్రభుత్వంతోపాటు ప్రస్తుత సర్కార్ కూడా మాటలు చెప్పిందని విమర్శించారు. 500మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లను నియమిస్తామన్నారని గుర్తుచేశారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే కల్తీ చేస్తున్నవారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.