TG: అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన కొనసాగిస్తుందని మంత్రి జూపల్లి అన్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చందుకు గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లెస్తున్నామన్నారు. వనపర్తి జిల్లా పానగల్(M)లో కస్తూర్బా గాంధీ విద్యాలయానికి రూ.40లక్షల వ్యయంతో ప్రహరీ నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.