AP: రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు ఓటేసి నాలుగోసారి మోసపోయారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్‌కు సంబంధించిన కీలక హామీలను తాకట్టు పెట్టిందన్నారు. ఉత్తరాంధ్రకు కీలకమైన రైల్వే జోన్ సాధన విషయంలో ప్రభుత్వం సరైన కృషి చేయడం లేదని విమర్శించారు. రైల్వే జోన్‌కు 5 దశాబ్దాలుగా ఉన్న డిమాండ్‌ను YCP పోరాటంతోనే సాధ్యమైందని పేర్కొన్నారు.