AP: గిరిజన ప్రాంత ప్రజలు మరింత అభివృద్ధి చెందాలని శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ఆకాంక్షించారు. పోలవరంలోని వట్టిగడ్డలో నిర్వహించిన సామూహిక వివాహాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 165 జంటలకు మంగళసూత్రాలను అందజేశారు. గిరిజన ప్రాంత ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే సామూహిక వివాహాలు జరిపిస్తున్నట్లు చినజీయర్ స్వామి తెలిపారు.