TG: బీఆర్ఎస్ను మళ్లీ టీఆర్ఎస్గా మార్పు గురించి పరిశీలిస్తామని మాజీమంత్రి కేటీఆర్ అన్నారు. గతంలో తాము కూడా కొన్ని తప్పులు చేశామని చెప్పారు. ఆ లోపాలను సరిదిద్దుకుంటామని తెలిపారు. అన్ని పథకాల్లో కాంగ్రెస్ విఫలమైందని విమర్శించారు. ఈసారి తామే అధికారంలోకి వస్తామని, కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు.