TG: మాజీమంత్రి హరీష్ రావు ఢిల్లీ పర్యటనపై ఎంపీ వద్దిరాజు రవిచంద్ర స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసుకు సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టు న్యాయవాదులతో మాట్లాడేందుకు ఢిల్లీకి వచ్చామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం మానుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, KCR సభకు హాజరవకుండా హరీష్ రావు ఢిల్లీ వెళ్లడంపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.