TG: 70 వేల మందికి మెరుగైన వైద్య సేవలు అందుతాయని Dy. CM భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురంలో విద్యుత్ సబ్ స్టేషన్కు శంకుస్థాపన చేశారు. కల్లూరులో 50 పడకల ఆస్పత్రిని ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. విద్యా, వైద్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని స్పష్టం చేశారు.