AP: రాష్ట్రంలో లిక్కర్ స్కాం అనేది కూటమి ప్రభుత్వం సృష్టించిందని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక కావాలనే జైలులో పెట్టారని విమర్శించారు. తాను ఇప్పుడైనా, ఎప్పుడైనా లిక్కర్ వ్యాపారం చేయనని స్పష్టం చేశారు. తన తండ్రి అంటే చంద్రబాబుకు, TDPకి అస్సలు పడదని గుర్తుచేశారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్‌ను సిట్ అమలు చేస్తోందన్నారు.