బీహార్లో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. 18 ఏళ్ల రూబీ అనే యువతి, ఇద్దరు పిల్లలున్న 32 ఏళ్ల సంధ్యా దేవిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరికీ సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ పరిచయం ఏర్పడింది. కేవలం 15 రోజుల్లోనే ఆ పరిచయం ప్రేమగా మారి ఇంట్లో నుంచి పారిపోయి వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం తమ కుటుంబాల నుండి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని వారు పోలీసులను ఆశ్రయించారు.