TG: హైదారాబాద్లో విదేశీ ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ట్రివియల్ చాప్టర్ సంస్థకు చెందిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రీస్, రొమేనియా ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి రూ. 50 వేల నుంచి రూ. 4లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. బాధితులను నమ్మించేందుకు నకిలీ వర్క్ ఆథరైజేషన్ లెటర్ ఇస్తూ మోసం చేస్తున్నారని పోలీసులు తెలిపారు.