TG: డ్రగ్స్ స్మగ్లింగ్‌లో ముఠాలు కొత్త మార్గాలు ఎంచుకుంటున్నాయి. వాట్సాప్, ఫేస్ బుక్‌లో లావాదేవీలతో పట్టుబడటంతో రూటుమార్చారు. సిగ్నల్, సెషన్ యాప్‌ల ద్వారా లావాదేవీలు కొనసాగిస్తున్నారు. గంజాయి, సింథటిక్ డ్రగ్స్‌లో 90 శాతం యాప్‌ల్లోనే HYDకి చేరుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే మత్తుకు బానిసలైన వారు ఎంత ధరకైనా డ్రగ్స్ కొనేందుకు సిద్ధపడుతున్నారట.