TG: కుటుంబసమేతంగా సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలం చేరుకున్నారు. కాసేపట్లో సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకోనున్నారు. రూ. 351 కోట్లతో ఆలయ విస్తరణ తొలిదశ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అభివృద్ధి పనులకు భూమిపూజ, శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మిథిలా స్టేడియంలో స్వామివారి కళ్యాణంలో పాల్గొంటారు. స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు.