AP: పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం వల్ల అరబ్ దేశాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో రాష్ట్రంలో బొప్పాయి ధరలు భారీగా పడిపోయాయి. 2 వారాల క్రితం రూ.13 వేలు పలికిన టన్ను బొప్పాయి ధర ఇప్పుడు రూ.9 వేలకు చేరింది. దీంతో ఇప్పటికే అకాల వర్షాలు, తెగుళ్లతో దిగుబడి తగ్గిందని వాపోతున్న బొప్పాయి రైతులకు ఇది గడ్డుకాలంగా మారింది. దిగుబడి, ధరలు ఒకేసారి తగ్గిపోవడంతో రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారు.