గ్యాస్ సిలిండర్ అవసరం లేకుండా, కేవలం కరెంటుతో నడిచే ప్లాస్మా స్టవ్ వచ్చేసింది. ఇది గాలిని అయాన్లుగా మార్చి ఎల్పీజీ తరహాలోనే మంటను పుట్టిస్తుంది. ఇండక్షన్ లాగా కాకుండా, దీనిపై అన్ని రకాల పాత్రలు వాడుకోవచ్చు. ఈ మంట ఉష్ణోగ్రత దాదాపు 1200 నుంచి 1300 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. గ్యాస్ లీకేజీ భయం లేని ఈ టెక్నాలజీ భవిష్యత్తులో వంటగదుల రూపురేఖలను మార్చేయనుంది.