AP: జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ విషయంలో జగన్ అసత్యాలు చెబుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. నెల్లూరు పర్యటనలో ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారని మండిపడ్డారు. వైసీపీ నిర్వాకం వల్లే తమిళనాడు బోట్లు ఏపీ జలాల్లోకి వస్తున్నాయని ఆరోపించారు. జూన్ నాటికి స్పీడ్ బోట్లతో తమిళనాడు బోట్లను కంట్రోల్ చేస్తామని మంత్రి వెల్లడించారు.