AP: లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు A1 నిందితుడు రాజ్ కేసిరెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయనతో పాటు రోనక్ కుమార్కు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. కాగా దాదాపు సంవత్సర కాలంగా జైలులోనే ఉన్న కేసిరెడ్డి గతంలో పలుమార్లు బెయిల్ కోసం పిటిషన్లు వేసినా న్యాయస్థానం తిరస్కరిస్తూ వచ్చింది.