TG: కొంతకాలంగా ఫామ్ హౌస్‌కే పరిమితమైన గులాబీ బాస్ KCR.. మళ్లీ ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నారు. ఈనెల 20న సాయంత్రం 5 గంటలకు జగిత్యాలలో KCR భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. చాలాకాలం తర్వాత గులాబీ బాస్ సభ నిర్వహిస్తుండటంతో, ఆయన ప్రసంగంపై BRS శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డి ఇదే వేదికపై KCR సమక్షంలో BRS కండువా కప్పుకోనున్నారు.