AP: రాష్ట్ర ప్రభుత్వం పేదలకు గుడ్న్యూస్ తెలిపింది. గతంలో పదేళ్ల తర్వాతే ఇళ్ల స్థలాలు అమ్ముకునే వీలుండగా.. ఇప్పుడు ఆ గడువును రెండేళ్లకు తగ్గిస్తూ మంత్రివర్గం నిర్ణయించింది. దీనివల్ల 2024లో పట్టాలు పొందిన వారు కూడా త్వరలోనే విక్రయించుకునే హక్కు పొందుతారు. ఈ మార్పుతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది పేద కుటుంబాలకు ఆర్థికంగా ఎంతో ప్రయోజనం కలుగుతుంది.