AP: అమరావతిపై జగన్ విషప్రచారం చేస్తున్నారని మంత్రి పార్థసారధి తీవ్రస్థాయిలో విమర్శించారు. ఊసరవెల్లి సైతం ఉలిక్కిపడేలా జగన్ నైజం ఉందని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. జగన్ మాట్లాడిన ప్రతి మాట అసత్యమని, రాజధాని విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.