TG: సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్ వద్ద జాతీయ రహదారిపై లారీని ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 16 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ నిద్ర మత్తులోనే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు అంటున్నారు.