AP: విద్యార్థుల ఎవరెస్ట్ యాత్రను మంత్రి లోకేష్ ప్రారంభించారు. దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎవరెస్ట్ శిఖర అధిరోహణ యాత్ర జరగనుంది. ఈ నెల 15 నుంచి 30 వరకు 16 రోజుల పాటు 21 మంది విద్యార్థుల బృందం యాత్ర చేయనుంది. 5,364 మీటర్ల ఎత్తులోని ఎవరెస్ట్ బేస్ క్యాంపును విద్యార్థులు అధిరోహించనున్నారు. నేపాల్ రాజధాని ఖాట్మండు నుంచి ఈ సాహసయాత్ర ప్రారంభంకానుంది.