TG: రాష్ట్రంలో రాబోయేది కచ్చితంగా BJP ప్రభుత్వమేనని కేంద్రమంత్రి బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ ఆయన కరీంనగర్లోని మహాశక్తి ఆలయం నుంచి కొండగట్టు అంజన్న సన్నిధి వరకు సుమారు 40 కిలోమీటర్ల మేర భారీ పాదయాత్ర చేపట్టారు. గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్, BRS, MIM పార్టీలు ఏకమైనా BJPని ఓడించలేవని బండి సంజయ్ పేర్కొన్నారు.