TG: నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం ఏజెన్సీ ప్రాంతంలో జీవిస్తున్న ఆదివాసీ చెంచులను బలవంతంగా వెళ్లగొట్టందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నారని కల్వకుంట్ల కవిత విమర్శించారు. స్థానికంగానే ఆదివాసీలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నల్లమలలోని సహజ సంపదను కొల్లగొట్టేందుకు చెంచులను అడవికి దూరం చేసే కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.