TVK పార్టీ అధినేత విజయ్ సమావేశంలో గన్ కలకలం రేపింది. ఇవాళ పుదుచ్చేరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఓ వ్యక్తి తుపాకీతో వచ్చాడు. అతన్ని గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే అదుపులోకి తీసుకున్నారు. కాగా కరూర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఈ సభకు 5 వేల మందికే అనుమతి ఇచ్చిన పోలీసులు కఠినమైన భద్రతను అమలు చేస్తున్నారు. అలాగే పార్టీ ఇచ్చిన క్యూఆర్ కోడ్ పాస్ ఉన్నవాళ్లనే అనుమతిస్తున్నారు.