AP: పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. రాజ్యాంగ నిర్మాత ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు.