AP: కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై మంత్రి టీజీ భరత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రాలయం దర్శనానికి వస్తూ ఎనిమిది మంది మృతిచెందడం బాధాకరమన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.