TG: ఆర్టీసీ కార్మికుల సమ్మె సెగ మొదలైంది. ప్రభుత్వం తమ డిమాండ్లపై మొండిగా వ్యవహరిస్తోందని జేఏసీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నెల 20 నుంచి నిరవధిక సమ్మెకు సిద్ధమని ఇప్పటికే ప్రకటించారు. మార్చి 13న నోటీసు ఇచ్చినా స్పందన లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ్టి చర్చలు విఫలమైతే రాష్ట్రవ్యాప్తంగా సామాన్య ప్రయాణికులకు రవాణా ఇబ్బందులు తప్పేలా లేవు.