ELR: మహనీయుల విగ్రహాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చింతలపూడి సీఐ క్రాంతి కుమార్ పేర్కొన్నారు. చింతలపూడిలోని అంబేద్కర్, జగజ్జీవన్ రామ్ విగ్రహాల వద్ద గురువారం ఆయన ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, అసాంఘిక శక్తులు విగ్రహాల విధ్వంసానికి పాల్పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.