అడివి శేష్, దర్శకుడు షానీల్ డియో కాంబోలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ‘డెకాయిట్’ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.40కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. ఇక మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించిన ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో అద్భుతమైన సంగీతం అందించాడు.