టాలీవుడ్ నటుడు జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘చేతబడి’. క్షుద్రపూజల నేపథ్యంలో, యదార్థ సంఘటనల ఆధారంగా దర్శకుడు సూర్యాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ఐదు భాషల ఆడియో హక్కులను ప్రముఖ సంస్థ సరిగమ భారీ ధరకు దక్కించుకుంది. M3 మీడియా, మహా మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంది.