మాస్ మహారాజా రవితజ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.. అనడానికి ప్రస్తుతం థియేటర్లో జరుగుతున్న మాస్ జాతర చూసి చెప్పొచ్చు. ఈ వారం రిలీజ్ అయిన రవితేజ లేటెస్ట్ ఫిల్మ్ ‘ధమాకా’ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఎన్నడూ లేని విధంగా రవితేజ ప్రమోషన్స్ ఈ సినిమాకు మరింత హైప్ తీసుకొచ్చింది. అందుకు తగ్గట్టే ధమాకా థియేటర్లో మాస్ జాతర చేయిస్తోంది. ఎంతలా అంటే.. కొన్ని చోట్ల స్క్రీన్స్ కూడా చిరిగిపోయాయి. ఈ సినిమాలో మాస్ పాటలకు తెర ముందు ఊగిపోతున్నారు. సోషల్ మీడియాలో ధమాకా బ్లాక్ బస్టర్ అంటూ ట్రెండ్ చేస్తున్నారు. ముఖ్యంగా మాస్ రాజా, శ్రీలీల స్టెప్పులు థియేటర్‌తో పాటు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో మాస్ బీట్స్ దుమ్ములేపుతున్నాయి. దాంతో క్రాక్ తర్వాత రవితేజకు మరో మాసివ్ హిట్ పడిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో.. ధమాకా ఓపెనింగ్స్ కూడా అదిరిపోయిందని అంటున్నారు. ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో భారీ ఆక్యుపెన్సీని నమోదు చేసినట్టు తెలుస్తోంది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా 5 కోట్లకు పైగా షేర్, 9 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిందని అంటున్నారు. దాదాపు 18 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ జరిగిన ధమాకా.. 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా బరిలోకి దిగింది. ఫస్ట్ డే కలెక్షన్లను బట్టి చూస్తే.. ఈ వీకెండ్ వరకు బ్రేక్ ఈవెన్ అవడం ఖాయయమంటున్నారు. పైగా క్రిస్మస్ హాలీడేస్ ఈ సినిమాకు కలిసి వచ్చేలా కనిపిస్తున్నాయి. మొత్తంగా రవితేజ మాసివ్ హిట్ కొట్టడంతో.. మాస్ మహారాజా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.