‘డెకాయిట్’ చిత్రంపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప్రశంసలు కురిపించాడు. తాను చూసిన అత్యుత్తమ సినిమాల్లో ఇది ఒకటని, మరే చిత్రంతోనూ దీనికి పోలిక లేదని కొనియాడాడు. నటి మృణాల్ ఠాకూర్ నటన అద్భుతమని పేర్కొన్నాడు. సుప్రియ యార్లగడ్డ నిర్మాణ విలువలు, అడివి శేష్ తపన ఈ విజయాన్ని అందించాయని ఆయన పేర్కొన్నాడు.